శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018 సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే యాత్రీకుల సంక్షేమం, పాలనకు సంబంధించి గురువాయూర్ మాదిరిగా శబరిమలకు ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 జనవరి 3 వరకు కొత్త చట్టాన్ని కోర్టు ముందుంచాలని గడువు విధించింది. కొత్త చట్టం రూపొందించమని ఆగస్ట్ 27న కేరళ ప్రభుత్వాన్ని కోరామని… అయితే కేవలం ట్రావన్ కోర్-కొచ్చిన్ హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ కు సవరణలు చేసిన తీసుకొచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది సరిపోదని…శబరిమల కోసం ప్రత్యేకంగా కొత్త చట్టం అవసరమని జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రావెన్ కోర్ -కొచ్చిన్ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ ప్రకారం ఆలయ సలహా సంఘంలో 1/3 వంతు మహిళలు ఉన్నారని…. మరి శబరిమల ఆలయ కమిటీలో మహిళలు ఉండవచ్చా అనే విషయాలు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. మత విశ్వాసాల అవసరంపై ధర్మాసనం విచారించేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు.