సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ రక్షిత అడవికి ఒక కిలోమీటర్ వరకు ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) ఉండాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాల చుట్టూ 1 కిమీ దూరంలో ఉన్న బఫర్ జోన్‌లో మైనింగ్ లేదా ఫ్యాక్టరీలు ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.
నిషేధిత జోన్‌లో శాశ్వత నిర్మాణాలను అనుమతించబోమని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఈఎస్ జెడ్ 1 కిమీ బఫర్ జోన్‌ను దాటితే లేదా ఏదైనా చట్టం ద్వారా బఫర్ జోన్ కు మించి పరిధిని నిర్ణయిస్తే ఆ సరిహద్దు అమలులో ఉంటుందని పేర్కొంది.
ఈ జోన్‌ల వెంబడి తయారీ లేదా ఇతర కార్యకలాపాలను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.