కేంద్ర మంత్రి కుమారుడు అశీష్ మిశ్రాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లకీంపూర్ హింస కేసులో ఆయనకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
అంతకు ముందు ఈ కేసులో ఆశీశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కకు పెట్టింది. వారంలోగా ఆయన పోలీసుల ముందు లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
ఆశీశ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారణలో పాల్గొనే బాధితుల హక్కును హైకోర్టు నిరాకరించిందని తెలిపింది.
అనేక అంసబద్ధ సమస్యలను, పరిశీలనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్‌ఐఆర్‌కు అనవసరమైన ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదు’ అని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.