తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటాలో వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శ్రీ సుధ, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, ఎన్. తుకారాం, వెంకటేశ్వర రెడ్డి , మాధవి దేవిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించనుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న హిమా కోహ్లీ పేరును.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కొలిజీయం ఇదివరకే సిఫారసు చేసింది.