మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో వరుసగా వివాదాస్పద తీర్పులు వెలువరించి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిప్ పుష్పా వీరేంద్ర గనేదివాలాకు కోలిజీయం షాక్ ఇచ్చింది. ఆమె ప్రమోషన్‌కు బ్రేక్ వేసింది.. ప్రస్తుతం నాగ్‌పుర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వరర్తిస్తున్నారు పుష్పా వీరేంద్ర. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆమెకు ప్రమోషన్ కల్పించేందుకు ఈ నెల 20న కొలిజీయం సిఫారసు చేసింది. కానీ ఇటీవల వరుసగా ఆమె ఇస్తున్న తీర్పులు వివాదాస్పదం అవుతుండటంతో పదోన్నతి ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కొలిజీయం వెనక్కి తీసుకుంది.
స్కిన్ టూ స్కిన్ టచ్ అయితేనే లైంగిక నేరం అవుతుందే తప్ప.. దుస్తులపై నుంచి తాకితే అది నేరం కిందకు రాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ నెల 19న పుష్పా వీరేంద్ర ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అంతకుముందు సరైన ఆధారాలు లేవంటూ మరో నిందితుడిని విడుదల చేస్తూ మరో తీర్పునిచ్చారామే. ఇక మైనర్ ప్యాంట్ జిప్ తీయడం కూడా లైంగిక నేరంగా పరిగణించలేమని కూడా ఆమె ఇంకో తీర్పునిచ్చారు. ఇలా ఈ నెలలోనే పోక్సో చట్టం కింద కేసులు నమోదైన మూడు కేసుల్లో నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి.ఈ క్రమంలోనే ఆమె ప్రమోషన్ కు బ్రేక్ వేస్తూ కొలిజీయం నిర్ణయం తీసుకుంది.