మహారాష్ట్ర రాజకీయ డ్రామాకు సుప్రీం కోర్టు డెడ్‌లైన్ విధించింది. 24గంటల్లో సీఎం ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
గవర్నర్ ఈ నెలాఖరు వరకు సమయమివ్వగా… వెంటనే బల పరీక్షకు ఆదేశాలివ్వాలంటూ ఎన్సీపీ, శివసేన సుప్రీంను ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
అసెంబ్లీలో మాత్రమే బల నిరూపణ జరగాలని, రాజ్‌భవన్ మెజారిటీని నిర్ణయించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ కన్నా మాత్రం… గతంలో ఇలాంటి సమయంలో 24గంటలే సమయమిచ్చామని, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలి కానీ… బీజేపీ కోరినట్లు ఎక్కువ సమయం ఎలా ఇస్తాం అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అయితే, బీజేపీ-ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో చేసిన సంతకాల కాపీని కోర్టుకు అందజేశారు.