ఖాళీగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ ను అనుమతించడం వైద్య విద్య, ప్రజారోగ్య ప్రయోజనాలకు మేలు చేయదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది.
నీట్ పీజీ 2021కి అర్హత సాధించిన డాక్టర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే7 తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయని పిటిషన్ లో తెలిపారు.
అందువల్ల స్పెషల్ కౌన్సిలింగ్ కు అవకాశం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
ప్రత్యేకమైన కౌన్సిలింగ్ కోసం రిట్ ఆఫ్ మాండమస్ కు ఆ విద్యార్థులు అర్హులు కారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ఉపశమనం వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంది.