ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అహోబిలం మఠం ఈవో నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మఠం సాధారణ కార్యకలాపాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీసింది. ఎందుకు మఠం చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించింది.
హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం కోర్టు.. ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని సూచించింది సుప్రీం.
ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.