కొన్ని వందల సంవత్త్సరాల క్రితం నుంచి కొనసాగుతున్న వివాదానికి తెరపడనుంది. మాదంటే మాదంటూ హిందువులు, ముస్లిమ్ మధ్య జరుగుతున్న వివాదం పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనుంది. అస్సలు ఈ అయోధ్య స్థల వివాదం ఎక్కడమొదలైందో తెలుసా…
1528లో రామ జన్మభూమిగా హిందువులు భావించే స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.
1853లో తొలిసారి అక్కడ మతవిద్వేషాలు మొదలై గొడవలు జరిగాయి. తరువాత అధికారులు
1859లో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి.. హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు.
మసీదు వద్ద 1949లో సీతారాముల విగ్రహాలను పెట్టారు హిందువులు. మరింత ఎక్కువగా గొడవలు జరగటంతో అది వివాదాస్పద భూమిగా ప్రభుత్వం ప్రకటించింది.
1984 అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కొన్ని హిందూసంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి.
1986లో హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై బాబ్రీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం తెలిపింది.
1989లో బాబ్రీ మసీదు వద్ద రామమందిర నిర్మాణానికి వీహెచ్‌పీ పునాదిరాయి వేసింది.
1990 అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు.
1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేశారు. ఆ తర్వాత దేశంలో మతకల్లోలాలు జరిగాయి.
1992 ద లిబర్హన్ కమిషన్ ఏర్పాటైంది
2010 వివాదాస్పద భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.
2011 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.
2017 అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.
2019 మార్చిలో మధ్యవర్తుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది.
2019 ఆగస్ట్ అయోధ్య వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీకూడా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది.
2019 ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణను ప్రారంభించింది.
2019 అక్టోబర్‌లో ఇరువర్గాల వాదనలు ముగిశాయి. సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
2019 నవంబర్ 9 సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించబోతోంది.