ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఆంధ్రా నుంచి తెలంగాణకు 12 మంది ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ జీతాల విషయంలో సుప్రీంను ఆశ్రయించారు.
ఉద్యోగుల పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం.. 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే సర్వీసు బ్రేక్ లేకుండా క్రమబద్ధీకరించాలని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టు ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో అభ్యర్థికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని.. కోర్టుకు రాని మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు.
రిలీవ్ అయిన ఉద్యోగుల తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు.