వివేకా హత్యకేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని రిపోర్టులో రాశారంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
వివేకా హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను బయట పెట్టాలని ధర్మాసం ఆదేశించింది. ఈ కేసును ఇంకా ఎంతకాలం విచారిస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ కేసులో విచారణాధికారిని మార్చండని లేదా అధికారి స్థానంలో మరొకరిని నియమించాలని సూచించింది. ఈ కేసులో ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారని కోర్టు వెల్లడించింది.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదికను పూర్తిగా చదివామని న్యాయస్థానం పేర్కొంది. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని ధర్మాసనం వెల్లడించింది. సీబీఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 29కి ధర్మాసనం వాయిదా వేసింది.