పేలుడు పదార్ధాలు తీసుకొచ్చి అందరిని ఒకేసారి చంపేయండి…ప్రజలను ఎందుకు బలవంతంగా గ్యాస్ ఛాంబర్ లోకి పంపిస్తున్నారు? 15 బ్యాగుల పేలుడు పదార్ధాలు తెచ్చి అందరిని ఒకేసారి చంపేయడం ఉత్తమం. ఢిల్లీ, దాని చుట్టు పక్క ప్రాంతాల్లో కాలుష్యంపై దాఖలైన పిటిషన్లు విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తున్నా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుద్దేశించి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీ విభేదాలను పక్కకు పెట్టండి..ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు కూర్చొని ఎయిర్ ఫ్యూరిఫయింగ్ టవర్స్ ఏర్పాటుకు పది రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని జస్టిస్ అరుణ్ మిశ్రా సూచించారు.