ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.. పీడీ ఖాతాలకు మళ్లించిన ఎస్‌డీఆర్ఎఫ్ నిధులను వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది.
రెండు వారాల్లోగా ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్టీఆర్ ఎఫ్ ఖాతాలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం.
అయితే నిధులు వెనక్కి ఇవ్వడంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటామని న్యాయవాది కోరగా.. అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు. దీనిపై తామే ఉత్తర్వులు ఇస్తామని వ్యాఖ్యానించింది.కాగా కొన్ని కొవిడ్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇంకా అందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో పరిష్కార కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది సుప్రీం. వచ్చిన ఫిర్యాదులను 4 వారాల్లోగా పరిష్కరించాలని కమిటీని ఆదేశించింది. పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 11 వందల కోట్లు చెల్లించాలని… ఎస్డీఆర్ ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.