ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరుపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ఏపీలో ఎన్నికలు రద్దు చేయలేదని, కేవలం వాయిదా వేశామని ఈసీ వాదించింది. అయితే ఏపీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను సవరించాలని ప్రభుత్వం కోరింది. అభివృద్ధి పనులను ఈసీ నిలుపుదల చేసిందా అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి… కోడ్ అమలులో లేనప్పుడు అసలు అనుమతి ఎందుకు అని సర్కార్ వాదించింది.
అభివృద్ధి పనుల విషయంలో ఈసీ అనుమతి కోరాలని… అనుమతి ఇవ్వని పక్షంలో అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సీజే ప్రభుత్వానికి సూచించారు.