ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తరలించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీకి చెందిన రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే ధర్మాసనం, వివాద పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపింది.
రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కమిటీ వేస్తామని తెలిపిన న్యాయస్థానం… రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రైతుల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలుపుతూ… ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం… గురువారం తదుపరి విచారణ చేపట్టనుంది.