రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిపై ఢిల్లీ పోలీసులు, హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ… తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రం పంతం వీడటం లేదని, చర్చల పేరుతో సాగదీస్తుందని ఆరోపిస్తూ… గణతంత్ర్య దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీకి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే చాలా మంది రైతులు ఢిల్లీ సరిహద్దులకు తమ ట్రాక్టర్లతో చేరుకుంటున్నారు.