విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికపై తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కీలక ఆదేశాల్చింది.
తెలంగాణ విద్యుత్ సంస్థల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు…. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. తెలంగాణకుక 584మందిని అదనంగా కేటాయించారని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు, పలువురు ఏపీ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.
దీంతో వారందరిని తెలంగాణ సర్కార్ సర్వీసులోకి తీసుకోవటంతో పాటు పెండింగ్ జీతాలు కూడా చెల్లించే అవకాశం ఉంది.