అయోధ్య తీర్పును 12గంటలకు వాయిదా వేసింది రాజ్యంగ ధర్మాసనం. ముందుగా చెప్పినట్లే 10.30కు కోర్టు హలుకు చేరుకున్నారున్యాయమూర్తులు, పిటీషనర్లు.
ఇదే కేసులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వేసిన సింగిల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్టు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ 1946 ఫజియాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన సింగిల్ లీవ్ పిటిషనూ కొట్టివేస్తున్నట్లు తెలిపారు.
చరిత్రను తవ్వే ఉద్దేశం కోర్టుకు లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం… బాబ్రీ మసీదును మీర్ బాక్వీ నిర్మించినట్లు తెలిపారు.