నిర్బయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అతని తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం పవన్ గుప్తా పిటిషన్‌పై విచారణ చేపట్టగా.. అతడి పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఈనెల 20న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను నిర్భయ దోషులు వినియోగించుకుంటున్నారు. తాజాగా పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చడంతో శుక్రవారం నిర్భయ దోషులకు ఉరి ఖాయమని అంటున్నారు న్యాయ నిపుణులు.