కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సరికొత్త ఆలోచనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. ఇది తమ వినతి మాత్రమేనని…ఆదేశాలు కావని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ప్రభుత్వ విధానాల అమలుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్బంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మంత్రి దగ్గర సరికొత్త ఆలోచనలున్నాయి. ఆయన కోర్టుకు వచ్చి మాకు సహకరించాలి…ఎందుకంటే ఆయన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నారు” అని కోర్టు పేర్కొంది.
”కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ లాయర్ ఏం ఆలోచనలు ఇవ్వలేకపోతున్నారు…ఇది చూస్తుంటే రాజకీయంగా కనిపిస్తుంది.. దీన్ని నిర్ణయించడానికి ఎవరైన అథార్టీ కలిగిన వాళ్లు కావాలి…దయచేసి రావడానికి ప్రయత్నించండి” అని చీఫ్ జస్టిస్ కోరారు.పిటిషనర్ తరపు లాయర్ ప్రశాంత్ భూషన్ వాదిస్తూ పెట్రోల్, డీజిల్ కార్లపై ప్రభుత్వం చార్జీలు వసూలు చేస్తూ ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సీడి ఇవ్వొచ్చన్నారు.
అప్పుడప్పుడు టపాసులు, చెత్త చెదారం కాల్చడం వల్ల పెద్దగా కాలుష్యం ఉండదని…మోటారు వాహనాల వల్ల కాలుష్యం తీవ్రంగా ఉంటుందని..దీని నియంత్రణకు సరైన పరిష్కారం కావాలని కోర్టు పేర్కొంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం కోర్టు పెండింగ్ లో ఉన్న వేరే పలు అంశాలతో ముడిపడి ఉందని…అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు కావాల్సిన పవర్, పబ్లిక్, ప్రేవేట్, పర్యావరణంపై ప్రభావం వంటి అంశాలకు సంబంధించినవని కోర్టు తెలిపింది. ఇది కేవలం ఢిల్లీ-ఎన్.సి.ఆర్ లకు మాత్రమే కాకుండా దేశానికి సంబంధించినదని కోర్టు తెలిపింది. దీనిపై నిర్ణయాధికారం కలిగిన వారు అన్ని సమస్యలు ఏక కాలంలో పరిష్కారమయ్యేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై స్పందించడానికి కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.