ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విక్రమ్నాద్ లతో కూడిన ధర్మాసనం సీబీఐ తమ విచారణను కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది.
మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై గతంలోనే సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయగా, తెలంగాణ హైకోర్టులో ఆ ఎఫ్.ఐ.ఆర్ ను ఆదిమూలపు సవాల్ చేశారు. కోర్టు ఆ ఎఫ్.ఐ.ఆర్ ను కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఇప్పటికే తాము 120మంది సాక్ష్యులను విచారించామని, మరో మూడు నెలల్లో విచారణ ముగిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన మంత్రి ఇదంతా కక్షపూరితంగా టార్గెట్ చేసిన కేసులని, తను నిర్ధోషిగా బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు.