సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవెసీ పాలసీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కొత్త పాలసీని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాట్సాప్ కొత్త పాలసీలను రద్దు చేసేలా చర్యలు చేపట్టాలన్న వినతిని తిరస్కరిస్తూ… ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపింది.
ప్రజల హక్కులను పరిరక్షించటంలో కేంద్రం విఫలమయ్యిందని, తమ గోప్యతకు భంగం కలగదన్న నమ్మకంతోనే వినియోగదారులు వివరాలు పంచుకున్నారన్నారు. కానీ ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి తీసుకరావాలనుకున్న కొత్త ప్రైవసీ పాలసీ దేశ చట్టాలను ఉల్లంఘించటమేనని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలకు కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషన్లో పేర్కొంది.