దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ పరీక్షను వాయిదా వేయటం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ముందుగా నిర్ణయించినట్లుగానే సెప్టెంబర్ 12న ఆదివారమే పరీక్ష యధాతథంగా జరిగి తీరుతుందని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష ఉంటుందని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. అయితే, అదే రోజున ఇతర పోటీ పరీక్షలున్నాయని.. సీబీఎస్ఈ కంపార్ట్ మెంట్ పరీక్షలు కూడా షెడ్యూల్ చేశారని అందువల్ల నీట్ ను రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే, ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదన్న సుప్రీం… నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా దాదాపు 16లక్షల మంది పరీక్షకు రెడీ అయ్యారని కామెంట్ చేసింది. మా తీర్పు లక్షలాది మందితో ముడి ఉంటుందని, పరీక్షల విషయంలో అత్యవసరం అయితే తప్పా జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
కరోనా కారణంగా నీట్ పరీక్ష ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది.