ఆడపిల్లలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2005 నాటి హిందూ వారసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటికి తల్లి లేదా తండ్రి బతికి ఉన్నా, లేకున్నా ఆడపిల్లలకు వారి ఆస్తులపై కుమారులతో సమానంగా హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.
తండ్రి, కూమర్తె ఇద్దరూ బతికి ఉంటేనే ..కూతురికి సహ-వారసత్వపు హక్కు దాఖలు అవుతుందని గతంలో.. 2005లో సుప్రీం కోర్టు సవరణ తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో సవరణ తేదీ నాటికి తండ్రి, కూతురు బతికి ఉన్నా ఉన్నా.. లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. తాజా తీర్పుతో .. సవరణ తీర్పు తేదీ నాటికి కూతురు బతికి ఉన్నా లేకున్నా… ఆమె సంతానం చట్టపరంగా ఆమెకు రావలసిన వాటాను కోరే హక్కు ఉంటుంది.