స్వర్ణ ప్యాలేస్ ఘటనలో ఏపీ ప్రభుత్వం ఆ భవన యాజమాన్యంతో పాటు రమేష్ హస్పిటల్స్ అధినేత డా.రమేష్ పై కేసులు నమోదు చేసింది. అయితే… డా.రమేష్ పరారిలో ఉన్నారని, పోలీసుల నోటీసులకు స్పందించటం లేదన్న ప్రచారం జరిగింది. దీనిపై డా.రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసి, స్టే తెచ్చుకున్నారు.
హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో డా.రమేష్ తో పాటు అన్ని అంశాలపై విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. దీనిపై వాదనలు విన్న సుప్రీం… రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుకు అవకాశం ఇచ్చింది. అందుకు డాక్టర్ రమేష్ కూడా సహకరించాలని ఆదేశించింది.
ఇప్పటి వరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. కానీ మొదటిసారి స్వర్ణ ప్యాలేస్ ఘటనలో మాత్రం స్టే తెచ్చుకోగలిగింది.