కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందా…? మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, తుది తీర్పు వచ్చే వరకు చట్టాల అమలుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రైతు సమస్యల పరిష్కారినికి నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిపుణలైన ప్రమోద్ కుమార్, అశోక్ గలాటి, హె.ఎస్. మన్, అనిల్ గన్వత్ తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రైతు సంఘాలతో భేటీ అవుతుంది. ఇరువురి వాదనలు వింటుంది. అన్ని వాదనలు విని… సుప్రీంకోర్టుకు ఈ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది.