ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 50శాతం రిజర్వేషన్లు మించొద్దన్న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. 48.13శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్‍పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారణ జరిపింది. 1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ రామ్మోహన్‍నాయుడు కోరారు.
2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.