పౌరసత్వా చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను ఈ రోజు విచారించనున్నారు. పౌరసత్వం చట్టంపై పలు సంస్థలు, వ్యక్తులు దాదాపు 60 పిటిషన్లు వేశారు. పిటిషన్లు వేసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అసోం గణ పరిషత్, నటుడు కలమ్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయం పార్టీ సహా పలు సంస్థలున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.