నిబంధనలు పాటించకుండా ప్లాట్లు చేసి అమ్మిన రియల్ ఎస్టేట్, అధికారులను శిక్షించకుండా… ఎల్.ఆర్.ఎస్ ద్వారా కొన్న వారిని శిక్షిస్తున్నారని సుప్రీంకోర్టులో జనగాం జిల్లాకు చెందిన జువ్వాడి సాగర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఏపి, తెలంగాణ, తమిళనాడు లో అమలు తలపెట్టిన లే ఔట్ రెగ్యులరైజేషన్ పథకాన్ని ఆయన సవాలు చేశారు.
జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం బుధవారం విచారణకు రానుంది. అక్రమ లేఔట్ల వల్ల వరదలతో సహా అనేక సమస్యలు వస్తాయని హైదరాబాద్, చెన్నై ల్లో వచ్చిన వరదలు రుజువు చేస్తున్నాయన్న పిటిషనర్… అక్రమ లేఔట్లకు అనుమతి ఇచ్చిన వాళ్లపై విచారణ జరిపాలని, ఎల్ ఆర్ ఎస్ ద్వారా సమీకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా మౌళిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలని, జిపిఎస్ విధానం ద్వారా అక్రమ నిర్మాణాలు నిలువరించాలని పిటిషనర్ కోరారు.