పెగాసస్ స్పైవేర్ తో ఫోన్స్ హ్యాక్ చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ పై కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కోరగా… ఇది దేశ రహస్యాలకు సంబంధించిన అంశమని కేంద్రం నిరాకరించింది. దీంతో సుప్రీం తనే నిర్ణయం తీసుకుంది.
ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని, ఈ కమిటీ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అయితే, కమిటీలో ఎవరుంటారు, ఎవరి బాధ్యతలెంటీ అన్న అంశాలపై వచ్చే వారం మధ్యంతర తీర్పునివ్వబోతున్నట్లు ప్రకటించారు.