వరకట్నంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం వంటి విషయాల్లో కోర్టులకు పరిమితులు ఉంటాయని తెలిపింది. ఇది ఒక సామాజిక సమస్య అని.. సమాజంలో మార్పు వస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుందని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
చట్టపరమైన సంస్కరణలతో పాటు సమాజంలో మార్పు కూడా తోడైతేనే ఇలాంటి సమస్యలు పరిస్కారమవుతాయని అన్నారు. అలాంటి వాటిలో వరకట్న సమస్య ఒకటని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయాన్ని లా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. వరకట్నం సమస్య నిరోధానికి పలు సూచనలు చేస్తూ కేరళకు చెందిన ఓ వ్యక్తి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ ఉన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.