నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మలయాళ నటి నజ్రియ ఫాహద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై మొదటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
ఇక ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రయోషన్‌లో భాగంగా తరచూ కొత్త కొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ అంటూ సాగే మెలోడి సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మే 9 సాయంత్రం 6.03కు విడుదల కానుంది.
సదరు ప్రోమోలో నాని తనకు ఏమైందో.. అన్నట్లుగా తనలో తాను మురిసిపోతున్నారు. ప్రేమలో పడ్డట్లు నాని, నజ్రియా ఇచ్చే క్యూ్ట్ ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇది వరకే చిత్రం నుంచి విడుదలైన ‘ది పంచకట్టు’ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది.
నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇక నాని ప్రస్తుతం ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు నేచురల్ స్టార్.