శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె భావోద్వేగానికి గురయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే…తల్లి మీనాతాయ్ ఠాక్రే ”నన్ను కూతురు లాగా చూసుకునే వారు..నిజంగా నేను వాళ్లను కోల్పోయాను…వాళ్లు ఇప్పుడు ఈ పరిసరాల్లోనే ఉంటారు” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వాళ్లు నన్ను కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే వారు. నా జీవితంలో వాళ్ల ప్రేమ ప్రత్యేకమైనది. ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ ట్వీట్ చేశారు సుప్రియా సూలె.
శరద్ పవార్, బాల్ ఠాక్రే రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకున్నా..ఆ రెండు కుటుంబాల మధ్య మొదటి నుంచి మంచి సంబంధాలే ఉండేవి.