బిజేపీ MP బాబుల్ సుప్రియో …నిన్న ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ముగిశాక తన ట్విట్టర్ లో హనుమ విహారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు … హనుమ విహారి తన బ్యాటింగ్ తో ఇండియాకు ఓ చారిత్రక గెలుపును దూరం చేయడమే కాక క్రికెట్ ను మర్డర్ చేశాడని అన్నాడు.
వెస్ట్ బెంగాల్ అసన్ సోల్ నియోజక వర్గానికి చెందిన MP బాబుల్ సుప్రియో…నిన్నటి మ్యాచ్ డ్రా అయ్యాక ఈ కామెంట్స్ చేశాడు. అయితే MP కామెంట్స్ పై నెటీజన్లు కూడా ఘాటుగానే స్పందించారు… క్రికెట్ అంటే పాటలు పాడడం, రాజకీయాలు చేయడమనుకున్నావా? అంటూ రివర్స్ కౌంటర్స్ ఇచ్చారు.
ఈ మ్యాచ్ లో… హనుమ విహారి 161 బంతులను ఎదుర్కొని 23 పరుగులు చేశాడు. అయితే పంత్ లాగా కాస్త ఎదురుదాడి చేస్తే ఇండియా గెలిచేదని…కేవలం చెడ్డ బంతులను బౌండరీలుగా మలిచిన ఇండియా గెలిచేదని అన్నారు సుప్రియో!