ఢిల్లీ నుండి ముంబాయ్ చూద్దామని ….1600 చేత పట్టుకొని వచ్చిన ఓ అమ్మాయి తలరాత ఊహించని రీతిలో మారిపోయింది. ఇప్పుడామె తీరికలేనంతగా సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయింది. ఆమె సురభీ చందనా.
అసలేం జరిగింది?:
MBA చదువుతున్న సమయంలో…. సరదాగా ముంబాయి ట్రిప్ వేద్దామని వచ్చిన సురభీ…. తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్ షూటింగ్ జరిగే ప్లేస్ కు వెళ్లి నిలబడింది. ఆమెను చూసిన షో డైరెక్టర్ ఈ సీరియల్ లో స్వీటి అనే పాత్రను చేయాలని రిక్వెస్ట్ చేశాడు….దానికి ఆమె ఒప్పుకోవడంతో….ఆమె దశ మారిపోయింది. ఈ సీరియల్ తర్వాత సురభీ లైఫ్ యే ఛేంజ్ అయిపోయింది….విపరీతమైన ఆఫర్స్ వచ్చిపడ్డాయి.
ఖుబూల్ హై, ఇష్క్ బాజ్, దిల్ బోలే లాంటి అనేక పాపులర్ సీరియల్స్ లో లీడ్ క్యారెక్టర్ చేస్తూ…కోట్లాది రూపాయలు సంపాదించింది.