సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాకన్నా ముందు సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి యొక్క సైరా చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి చేస్తున్న ఏజెంట్ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నాడట.
నాగార్జున ఈ మార్పులను చెప్పాడట. ఈ మార్పులు లాజికల్‌గా ఆకర్షణీయంగా అనిపిస్తాయని చెప్పాడట. కానీ సురేందర్ రెడ్డి ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.
అఖిల్,హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలకు కూడా నాగార్జున కొన్ని మార్పులు చెప్పారు. కానీ అవేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అలాగే తన రొటీన్ ఆలోచన విధానం కొత్త తరం ప్రేక్షకులకు సరిపోదు కాబట్టి డ్రీమ్ ప్రాజెక్ట్ బంగార్రాజు కూడా వర్కవుట్ కాలేదు.
మరి ఏజెంట్ కోసం నాగ్ ఇస్తున్న సలహాలు ఉపయోగ పడతాయో లేదో చూడాలి. ఇకపోతే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా ఇటీవల మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.