జగన్ సర్కార్ కొలువుదీరి నాలుగు మాసాలు అవుతున్నా.. పరిపాలనలో ఇంకా కుదురుకోనట్టే కనిపిస్తోంది. వివిధ శాఖల్లో కార్యదర్శులు, శాఖాదిపతుల్ని తరచూ మారుస్తున్నారు. వారానికోసారి ఏదో బదిలీ జరుగుతూనే వుంది. తాజాగా మరికొంతమంది అధికారుల బదిలీ జరిగింది.
వివరాలు ఇలావున్నాయి…
ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ..
డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం.
ఆర్టీసీ ఎండీగా ఎం టీ కృష్ణబాబుకి అదనపు భాద్యతలు.
పరిశ్రమలు, మౌలిక వసతులు,పెట్టుబడుల శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేశ్ బదిలీ.
సీఎం అదనపు కార్యదర్శి జె.మురళికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత.