చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక బ్యాట్స్ మెన్, టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ట్విస్ట్ ఇచ్చాడు. హాఠాత్తుగా జట్టును వదిలేసి దుబాయ్ నుండి వచ్చేసిన రైనాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తనకు కేటాయించిన హోటల్ రూం నచ్చక అని కొందరు, రైనాకు ఇంపార్టెంట్స్ ఇవ్వకపోటమే కారణమని, యాజమాన్యంతో పొసగక అంటూ రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి.
దీనిపై తాజాగా రైనా స్పందించాడు. తనకు తండ్రిలాంటి తన మామ మరణించటం వల్లే వచ్చేశానని, తను త్వరలో మళ్లీ జట్టుతో జాయిన్ కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ… తనకు ఎవరితో ఎలాంటి ఇబ్బంది లేదని, ధోని బాయ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, గొడవలు కేవలం మీడియా సృష్టి అని కొట్టిపారేశాడు. తాను ఇప్పటికే క్వారెంటైన్ నిబంధనలకు లోబడి ప్రాక్టీస్ చేస్తున్నాని, మళ్లీ వెళ్లి అన్ని నిబంధనలు పాటిస్తూనే జట్టుతో చేరుతానన్నాడు.
చెన్నై టీం యజమాని శ్రీనివాసన్ ఇక చెన్నైతో తన ప్రయాణం ముగిసినట్లేనని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రైనా స్టెట్మెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.