సౌత్ స్టార్ హీరో సూర్య గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అలాగే ఆయన భార్య జ్యోతిక గురించి కూడా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఇద్దరు 2006లో వివాహం చేసుకున్నారు. నేడు వీరి పెళ్లి రోజు కాగా… నేటితో ఈ ఇద్దరు వివాహం చేసుకొని 15 ఏళ్లు గడిచింది. ఈ ఇద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అంతేకాకుండా ఇద్దరికీ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలు చేసే అవకాశం పుష్కలంగా ఉన్నా…. ఫ్యామిలీకే పరిమితమైంది. ఇక పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయం వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథలతో జ్యోతిక అలరిస్తోంది.