సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. సూర్య ఆ సినిమా ఇచ్చిన జోష్ ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గౌతం మీనన్ దర్శకత్వంలో తొలి వెబ్ సిరీస్ లో నటించాడు. అలాగే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా సన్ పిక్చర్స్ నిర్మాణంలో సూర్య 40 ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించనుంది. అయితే ఈ సినిమాకు ఉన్న ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే ఈ సినిమాలో సత్యరాజ్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. మొదటి సినిమా ఇదే. ఈ కాంబో పై ఇప్పటికే అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.