ఎన్టీఆర్ అభిమానులకు గత ఏడాది లానే ఈ ఏడాది నిరాశ ఎదురయ్యింది. తన పుట్టిన రోజు వేడుకలను ఎవ్వరూ జరపవద్దని తారక్ లేఖ ను విడుదల చేశాడు. మరో వైపు తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి తారక్ లుక్, టీజర్ వస్తాయని అందరూ ఆశపడ్డారు. కానీ అది కూడా జరగలేదు. దీనితో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే తారక్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ మాత్రం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తానంటున్నాడు. ‘‘తారక్ అభిమానుల కోసం నేనొక స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ఈరోజు సిద్ధం చేస్తున్నాను. వేచి చూడండి’’ అంటూ స్టీవెన్స్ మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇంతకీ అతను ఏం రెడీ చేశాడు.. ఎలా ఉండబోతుందని తెలుసుకోవటానికి తారక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.