సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ సినిమా నుంచి టీచర్ గాని రెండో పాట విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు సర్ ప్రైజ్ ఇస్తున్నట్టు థమన్ ట్వీట్ చేశాడు.
మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27 వ చిత్రం క్రిష్ దర్శకత్వం లో రాబోతుంది ఈ సినిమా అప్డేట్ ను మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తెలుపుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరోవైపు 28 వ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొత్తం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిమానులను ఉత్సాహపరుస్తూ పవన్ సినిమాల అప్డేట్ లు రాబోతుండటంతో అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు.