తమిళ్ స్టార్ హీరో సూర్య కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన హీరోలు హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉన్నారు. ఆ సమయంలోనే మేకప్ లేకుండా వారి ముఖాలను కూడా అభిమానులకు చూపించారు. తాజాగా సూర్య రియల్ లుక్ లో కనిపించి అందరికీ షాకిచ్చాడు. తన ఇంట్లో ఆన్ లైన్ ద్వారా ట్రైనర్ సూచనలు చేస్తూ ఉండగా సూర్య వర్కౌట్లు చేశాడు.
జిమ్ పూర్తయిన తర్వాత ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో సూర్య ఎప్పుడు చూడని విధంగా తెల్ల గడ్డం, జుట్టు తో కనిపించాడు.ఇక అది చూసిన ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.