తమిళ స్టార్ సూర్య సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతుంది. గతంలో సుధాకొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తరువాత వచ్చిన జై భీమ్ సినిమా కూడా ఓటిటి లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం సూర్య పాండిరాజ్ డైరెక్షన్ లో ఎతర్కుం తునిందావన్ అనే సినిమా చేస్తున్నాడు.
మార్చి 10న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కాబోతుంది.కాగా తెలుగు రైట్స్ ను ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పొందింది.
ఇక ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరుస సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్న సూర్య మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.