శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే హైదరాబాద్ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయానికి రోహిత్ శర్మ ముందు రాగా.. తర్వాత హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, విరాట్ కోహ్లి వస్తున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. భారత క్రికెటర్లు పార్క్ హయత్ హోటల్‌లో బస చేస్తున్నారు.
టీం ఇండియా క్రికెటర్లు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. నజీర్ ఖాన్ ఇంట్లో వీరంతా సమవేశమయ్యారు. నజీర్ ఖాన్ ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడు. అలాగే టీం ఇండియాలో అనేక మంది క్రికెటర్లతో ఆయన సన్నిహితంగా ఉంటారు. న్యూజిలాండ్ తో రేపు జరిగే వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ కు చేరుకున్న క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు.
నిన్న రాత్రి ఇర్ఫాన్ ఇంట్లో టీం ఇండియా క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. వారితో కలసి డిన్నర్ చేసినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ దేశ వ్యాప్తంగా హిట్ కావడంతో ఆయనను క్రికెటర్లు కలిసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సూర్యకుమార్ యాదవ్, చాహల్, ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శార్దూల్ లు కలశారు. వారితో కలసి జూనియర్ ఎన్టీఆర్ సరదాగా కొద్దిసేపు గడిపారు.
కాగా సూర్యకుమార్ యాదవ్, చాహల్, గిల్ తదిరులు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూర్య, అతడి భార్య కలిసి ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా ఫొటో దిగారు. ఈ ఫొటోను సూర్యను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘నిన్ను కలవడం సంతోషంగా ఉంది బ్రదర్.. ట్రిపుల్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నందుకు మరోసారి అభినందనలు’ అని సూర్య ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.