సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యం మరోసారి బయటపడింది. ఓ వ్యక్తిని చితకబాదితే… నన్ను ఇలా చేశారంటూ బాధితుడు మీడియా ముందు గోడు వెల్లబోసుకుంటున్న సందర్భంలోనూ విడిచిపెట్టలేదు. బూతులు తిడుతూ దాడి చేసే ప్రయత్నం చేసి, మీడియా వాళ్లను చూసి వెళ్లిపోయారు.
రోడ్డును ఆక్రమించి గోడక డుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయటమే ఆ వ్యక్తి చేసిన తప్పు. గొడ్డుకన్నా హీనంగా చిత్రహింసలు పెట్టినట్లు బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.