‘కాళిదాసు’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన నటుడు సుశాంత్ అక్కినేని. నట వారసత్వం ఉన్నా, అడుగు పెట్టి 15 ఏళ్ళు అవుతున్నా స్టార్ డమ్ మాత్రం సుశాంత్ అందుకోలేకపోయాడు.
ఒకట్రెండు సినిమాలు మినహా ఇతర సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో సుశాంత్ రూటు మార్చాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో సెకండ్ హీరోగా మారాడు.
‘రావణాసుర’ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా ఆఫర్ కొట్టేశాడు. ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కీర్తి బోయ్ ఫ్రెండ్ గా సుశాంత్ నటించనున్నాడు. తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.