సుశాంత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. దాంతో కోర్టు 14రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే రియా చక్రవర్తితో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆమె సోదరుడు షోవిక్ సహా మొత్తం ఆరుగురు ముంబాయ్ సెషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.
బెయిల్ తిరస్కరణతో రియా చక్రవర్తి సెప్టెంబర్ 22వరకు జ్యూడిషియల్ రిమాండ్ లోనే ఉండనుంది. సెప్టెంబర్ 9న ఆమెకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు అక్రమంగా డ్రగ్స్ అందించినట్లు నార్కొటిక్ బ్యూరో అధికారులు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈకేసులో రియా చక్రవర్తి దోషి అని తేలితే ఆమెకు గరిష్టంగా 10సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బెయిల్ పై వాదనల సందర్భంగా రియా చక్రవర్తి అమాయకురాలని, కావాలనే అనుమానంతోనే మాత్రమే ఆమెను ఈ కేసులో ఇరికించారని రియా తరుపు లాయర్ వాదించారు.