బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి తర్వాత ఎన్నో కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం కూడా అప్పుడే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు సుశాంత్ రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్ళు గడిపాను. మొదటి 30 ఏళ్ల ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను. ప్రతి పనిలో మంచి గా ఉండాలని కోరుకున్నాను. అలాగే స్కూల్ ,టెన్నిస్ ,చదువు, ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను. ప్రతీ కోణాన్ని అలా చూడటం వల్లే నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని. నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను. ఎందుకంటే నేను ఏంటో తెలుసుకోవడానికి ఆట ఉంది అంటూ రాసుకొచ్చారు.