బాలీవుడ్ నటి, అందాల భామ సుస్మితా సేన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల క్రితం తనకు గుండె పోటు వచ్చినట్టు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
రెండు రోజుల క్రితం తనకు గుండె పోటు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. దీంతో వైద్యులు తనకు అంజియో ప్లాస్టీ చేశారని వివరించారు. గుండె లోపల స్టంట్ వేశారని ఆమె తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారన్నారు.
మీ గుండెను ధైర్యంగా ఉంచండని ఆమె సూచించారు. అవసరమైన సమయంలో అది మీకు అండగా ఉంటుందన్నారు. తనకు పెద్ద గుండె ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు తనకు సహకరించిన చాలా మందికి కృతజ్ఞతలు తెలపాలన్నారు.
వారందరికీ మరో పోస్టులో ధన్యవాదాలు చెబుతానన్నారు. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానన్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో అనుచరులతో పంచుకోవాలనుకున్నానన్నారు. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నానన్నారు. తాను మరి కొంత జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.